Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

వినుకొండ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

వినుకొండ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కూటమి పాలన: చీఫ్‌ విప్ జీవీ

అంబేద్కర్ జయంతి సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఘన నివాళి

న్యూస్ తెలుగు /వినుకొండ :

టిడిపి ఆధ్వర్యంలో.. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగానే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాలరాసిందని, వాటిని పునరుద్ధరించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అంబేద్కర్ ఆదర్శాలను ఆచరణలో పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని, అందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, నిరుపేద కుటుంబంలో జన్మించినా అంటరానితనం, అసమానతలను అధిగమించి భారతరత్నంగా ఎదిగారని కొనియాడారు. అనేక దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసి, భిన్న సంస్కృతులు, మతాలున్న భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. దళితులు, బీసీలకు రిజర్వేషన్లు, సమాజంలో అసమానతల తొలగింపునకు పునాది వేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అందుకే తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని, సీఎం చంద్రబాబు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. మరీ ముఖ్యంగా గురుకుల విద్యా విధానాన్ని బలోపేతం చేసి, ఏపీని దేశానికే ఆ విషయంలో ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు, నిరుద్యోగ యువతకు లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదని, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా, గురుకుల పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా అందించలేదని విమర్శించారు. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం, అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. యువత అందరు కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని, నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అట్టడుగు వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, కూటమి నాయకుల యార్లగడ్డ లెనిన్ కుమార్, నిస్శంకర శ్రీనివాసరావు, అయూబ్ ఖాన్,పి.వి.సురేష్ బాబు, కొమ్ము తోటి పౌల్, దాసయ్య, దాసరి కోటేశ్వరరావు, పత్తి పూర్ణ, రెడ్డి నగేష్, నందు నరసింహారావు, బర్మా, ఆచారి, అమెజాన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం చీఫ్‌ విప్ కార్యాలయంలో కూటమి నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, చిత్రపటానికి నివాళులర్పించారు.

జనసేన ఆధ్వర్యంలో..

డా.అంబేద్కర్ జయంతి సందర్బంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైసీపీ ఆధ్వర్యంలో..

నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా

స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు భారత రాజ్యాంగ రూప శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డా. బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో..

వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రెసిడెంట్ మీసాల శ్రీనివాసరావు, సెక్రెటరీ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతి విచ్చేశారు. ఈ సంద్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ. మహానుభావుడి డా.బీఆర్‌ అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ పితామహుడు అని స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్‌ అంబేద్కర్‌ కీలకపాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరావు, సెక్రటరీ పి గౌస్ మొహిద్దిన్ ఖాన్ వైస్ ప్రెసిడెంట్ పివీ రమణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎన్ శేఖర్ బాబు, ట్రెజరర్, వి శివ శంకర్ బాబు, సీనియర్ న్యాయవాదులు పీ జె లూకా, ఎన్ రామకోటేశ్వరరావు, పి సైదారావు, వై శ్రీనివాసరావు, సి హెచ్ ఎల్ ఎన్ మూర్తి, ఎస్ కె సిద్దయ్య, బి శ్రీనివాసరావు,ఎం ఎలిషా బాబు, జూనియర్ న్యాయవాదులు, గుమస్తాలు పాల్గొన్నారు.  (Story : వినుకొండ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!