మే 07 న హైదరాబాదులో ఇంద్ర పార్క్ దగ్గర శ్రీ విజయ శంకర స్వామి ఆధ్వర్యంలో ధర్నా
న్యూస్‌తెలుగు/వనపర్తి : వచ్చేనెల మే 07/05/2025 రోజున హైదరాబాదులో ఇంద్ర పార్క్ దగ్గర శ్రీ విజయ శంకర స్వామి ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి తెలంగాణ కవులు కళాకారులు నిర్ణయించుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యందు నిరంతరం హరినామ సంకీర్తన జరుగుతున్నది మన తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరినామ సంకీర్తన నిరంతరం జరగాలని అదేవిధంగా భజన సభ్యులకు ఏ గుడికి వెళ్లిన ఉచిత దర్శనం ప్రసాదం ఇచ్చే విధంగా భజనపరులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని శ్రీ విజయ శంకర స్వామి ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాము ఇట్టి కార్యక్రమానికి సంబంధించి వనపర్తి నందు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గోడపత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాములు భజన మండలి సభ్యులు టి వెంకట్ రాములు వై నాగేష్ యాదవ్ చిన్నారెడ్డి బాల్ రెడ్డి వామనాచారి కురుమయ్య శ్రీశైలం సురేష్ మాధవరెడ్డి శ్రీను శెట్టి వెంకటయ్య శేఖరయ్య శెట్టి హనుమంత్ రెడ్డి మోహన్ వెంకటేష్ వై భరత్ సింహా యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగినది కవులు కళాకారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. (Story : మే 07 న హైదరాబాదులో ఇంద్ర పార్క్ దగ్గర శ్రీ విజయ శంకర స్వామి ఆధ్వర్యంలో ధర్నా)