మార్కెట్ కమిటీ మెంబర్గా ఎన్నికైన సాల్మన్ రాజును సన్మానించిన జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు/చింతూరు : మార్కెట్ కమిటీ మెంబర్గా చింతూరు గ్రామానికి చెందిన పసుపులేటి సాల్మన్ రాజు ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందిస్తూ శనివారం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకెసిటి ట్రస్ట్ చైర్మన్ మహమ్మద్ జమాల్ ఖాన్ తన క్యాంపస్లో ఆహ్వానించి శా లువా కప్పి సన్మానించారు. తెలుగుదేశం పార్టీలో 34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ ఎదుగుదలకు మంచి పనులు చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అగ్రనాయకత్వాన్ని దృష్టి ని ఆకర్షించి మార్కెట్ కమిటీ సభ్యుడుగా ఎన్నిక కావడం పట్ల ఆయన అభిమానులు ప్రత్యేకంగా వైద్యలు జమాల్ ఖాన్ అభినందనలు తెలిపారు. ఇంకా అంచలంచలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరాలని కీర్తి ప్రతిష్టలు పొందాలని సాల్మన్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమం లో ఇమ్రాన్ ఖన్, బొర్రా రమణ, జబీర్, జాన్ప్రకాష్, సుందర్ జాన్, బాబు భాయ్ తదితరులు పాల్గొన్నారు.(Story : మార్కెట్ కమిటీ మెంబర్గా ఎన్నికైన సాల్మన్ రాజును సన్మానించిన జమాల్ ఖాన్ )