ఇంటర్ ఫలితాలు విడుదల
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతూరు నందు మార్చి 2025 లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ప్రథమ సంవత్సరం నందు మొత్తం 190 మంది హాజరు అవ్వగా 46 మంది విద్యార్థులు పాస్ అయ్యారని,అలాగే రెండవ సంవత్సరంలో 160 మంది విద్యార్థులు హాజరు అవ్వగా 75 మంది విద్యార్థులు పాస్ అయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ నాగుల్ మీరా తెలిపారు.
మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 24.2 గానూ,అలాగే రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 46.9 గా సాధించారని పేర్కొన్నారు.మొదటి సంవత్సరం విద్యార్థిని సైన్స్ గ్రూప్ నుండి కుంజా కళ్యాణి 404/440 మార్కులు సాధించారని,పి సాయి మేఘన 367/470 మార్కులు సాధించగా, సెకండ్ ఇయర్ విద్యార్థిని
మడివి శైలజ 786/1000, మరియు కొవ్వాసి సోమధయ్య 752 అధ్యధిక మార్కులు సాధించారని తెలిపారు.అలాగే పరీక్షలలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు అందరినీ కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు. అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు ఈ నెల 22.04.2025 లోపు పరీక్ష ఫీజు చెల్లించుకోవాలని, అదేవిధంగా సప్లిమెంటరీ పరీక్షలు మే 12 వ తేదీ నుండి జరుగుతాయని పూర్తి వివరాలకు జూనియర్ కళాశాలను సంప్రదించాలని తెలియజేశారు. (Story : ఇంటర్ ఫలితాలు విడుదల)