పొగాకు నియంత్రణ గోడ పత్రికల విడుదల
న్యూస్‌తెలుగు/అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యం లో జిల్లా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ లో పొగాకు పదార్థాల వాడకం మీద నిషేధ కార్యక్రమాలని జిల్లా పొగాకు నియంత్రణా అధికారులు చేపట్టారు. బుధవారం అనంతపురం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. విష్ణుమూర్తి ఆధ్వర్యంలో పొగాకు నియంత్రణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నెలకు రెండు సార్లు ఎన్ఫోర్స్ మెంట్ డ్రైవ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారికీ అవగాహన కల్పించి 200 రూపాయలు జరిమానా విధించవలెను అని తెలియజేశారు,,
జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ బోయ. శ్రీరాములు మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యాలయ చుట్టూ ప్రక్కల,పొగాకు సంబంధించిన దుకాణాలను, కార్యాలయ ఆవరణలో బీడీలు సిగరెట్లు గుట్కా, పాన్ పరాగ్,కైని జర్దా, మొదలగు పదార్థాలను నిషేధించడం జరిగిందన్నారు. దీనికి సంబందించిన గోడ పత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం జరిగిందన్నారు.
కొటేప యాక్ట్-2003 చట్టం ప్రకారం,బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే 200 రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. అలాగే18 సంవత్సరాల లోపు పిల్లల చేత సిగరెట్ మరియు పొగాకు ఉత్పత్తులు, అమ్మ రాదు వారిచేత అందించరాదన్నారు. విద్యాసంస్థలకు 100 గజాల లోపు, పొగాకును నిషేధించడం జరిగిందనీ అతిక్రమించిన వారు శిక్షర్హులన్నారు. అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ను పొగాకు రహిత ప్రాంతంగా మార్చడానికి ప్రతి ఒక్కరు చేతులు కలపాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రాన కార్యక్రమ సామజిక కార్యకర్త శ్రీరాములు సూపరిండెండెంట్ సుజాత మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story : పొగాకు నియంత్రణ గోడ పత్రికల విడుదల )