రఘురామారావు కుటుంబసభ్యులకు రావుల పరామర్శ
న్యూస్‌తెలుగు/వనపర్తి : రేవల్లి మండల పార్టీ అధ్యక్షులు, కేశంపేట గ్రామానికి చెందిన పి.రఘురామారావు మరణం తనను చాలా బాధించిందని ఒక ఆత్మీయున్ని కోల్పోవడం దురదృష్టకం అని మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేశంపేట వారి స్వగృహంలో ఆయన భార్య మండోదరి మరియు కుమార్తెలు, అల్లుండ్లు,బంధువులను పరామర్శించి ధైర్యం ఉండాలని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచిగా,సింగిల్ విండో అధ్యక్షులుగా,మండల పార్టీ అధ్యక్షులుగా వీరి సేవలు మరువలేనివి అని రఘురామారావు లేని లోటు ఈ ప్రాంత ప్రజలకు పార్టీకి నాకు తీర్చలేనిదని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు. రావుల చంద్రశేఖరరెడ్డి వెంట నందిమల్ల.అశోక్,మాజీ సర్పంచ్ గోపాల్ రావు,నారాయణ రావు,యాదయ్య,బాలయ్య తదితరులు ఉన్నారు. (Story : రఘురామారావు కుటుంబసభ్యులకు రావుల పరామర్శ)