‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ దర్శనమే రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
విశాల్ చంద్ర శేఖర్ దర్శనమే కోసం క్లాసిక్ మెలోడీ ని ఫ్రెష్ బీట్స్ తో అద్భుతంగా కంపోజ్ చేశారు. మనసుని కట్టిపడేసే ట్రాక్ ఇది. యాజిన్ నిజార్ వోకల్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్తాయి, అతని వాయిస్ మెస్మరైజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం శర్వా ఎమోషన్స్ అద్భుతంగా వర్ణిస్తుంది.
స్క్రీన్ పై శర్వా చరిస్మాటిక్ ప్రజెన్స్ కట్టిపడేసింది. సంయుక్త అందంగా కనిపిస్తుంది. శర్వాతో మ్యాజికల్ కెమిస్ట్రీని పంచుకుంటుంది. వారు తమ ప్రేమకథను ప్రేక్షకులను అలరించే విధంగా పెర్ఫామ్ చేశారు.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వర్తిస్తున్నారు. భాను బోగవరపు కథను రాశారు, నందు సావిరిగణ సంభాషణలను అందించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
తారాగణం: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
DOP: జ్ఞాన శేఖర్ VS, యువరాజ్
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా (Story : ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ )