ప్రభుత్వ గుండె నొప్పి ఇంజక్షన్
ఒక ప్రాణాన్ని నిలిపింది
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ సమీపంలోని పెద కంచర్ల గ్రామ రైస్ మిల్లుకు వడ్ల తో విజయవాడ నుండి ఒక లారీ బుధవారం వచ్చింది. లారీ క్లీనర్ శివయ్య కు ఉదయం 8 గంటల సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గుండెనొప్పితో వచ్చారు. చెమటలతో తడిచి, పడిపోయిన పరిస్థితి లో ఉన్నారు. ఆరోగ్య కేంద్రం ఎ న్ మ్ చందోలు నాగవాణి, సి. హెచ్. ఓ.ప్రమీల ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన నాగవాణి తన సొంత కారులో తానే డ్రైవింగ్ చేసుకుంటూ వినుకొండ ఏరియా ఆసుపత్రి కి తీసుకొచ్చారు. ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రజయాక్ సిబ్బంది వెంటనే ఈ సి జీ, తీసి రక్త పరీక్షలు బీపీ చెక్ చేసి ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 40 వేల రూపాయల గుండె నొప్పి ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలను కాపాడారు. అనంతరం ఎన్. ఎం నాగవాణి విషయాన్ని విజయవాడ లోని బందువులకు సమాచారం అందించి, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్సులో గుంటూరుకు తరలించారు. ఇటీవల ప్రభుత్వం గుండె నొప్పి ఇంజక్షన్ అందుబాటులో ఉంచడం, తక్షణమే వైద్య సిబ్బంది వైద్యం అందించడం తో రోగి తరుపు బంధువులు, పెదకంచర్ల గ్రామస్తులు , మరియు రైస్ మిల్లు ఓనర్ శ్రీనివాసరావు ప్రభుత్వ వైద్య సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు. (Story : ప్రభుత్వ గుండె నొప్పి ఇంజక్షన్ ఒక ప్రాణాన్ని నిలిపింది)