Home వార్తలు తెలంగాణ భారతదేశ ఉత్పత్తులపై సుంకాలను ఆపాలి: సిపిఐ

భారతదేశ ఉత్పత్తులపై సుంకాలను ఆపాలి: సిపిఐ

0

భారతదేశ ఉత్పత్తులపై సుంకాలను ఆపాలి: సిపిఐ

న్యూస్‌తెలుగు/వనపర్తి : భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి సిపిఐ ఆఫీసులో భాస్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రపంచంలో ఎంతో గొప్ప నాయకుడని చెబుతున్నారని, అధిక సుంకాలను ఆపమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అడిగే ధైర్యం మోడీకి ఎందుకు లేదన్నారు.రూ. 50 లక్షల డాలర్ల గోల్డ్ కార్డు కొంటేనే అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చు అని చెబుతున్నారని ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన భారతీయులకు ఇది ఎంతో భారమన్నారు. దేశంలో వచ్చే మార్చి వరకు వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని అమిత్ షా చెబుతున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చత్తీస్గఢ్లో మావోయిస్టులను వేటాడి కాల్చివేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వేటిని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రూ. 500 కి సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు మాఫీ పాక్షికంగానే అమనవుతున్నాయన్నారు. పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో హామీలను అమలు చేయాలని, ప్రజల్లోవ్యతిరేకత పెరుగుతోందని చెబుతూ వస్తున్నామన్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంటే మిత్రపక్షమైనప్పటికీ సిపిఐ ఎంతోకాలంచూస్తూ ఊరుకోలేదన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు, కార్యవర్గ సభ్యులు కళావతమ్మ , శ్రీరామ్, మోష, రమేష్ అబ్రహం గోపాలకృష్ణ, రవీందర్, శ్రీహరి నరసింహ శెట్టి తదితరులు పాల్గొన్నారు. (Story : భారతదేశ ఉత్పత్తులపై సుంకాలను ఆపాలి: సిపిఐ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version