ఆదిరెడ్డి పరదేశి నాయుడు కి పీహెచ్ డీ డాక్టరేట్
చెన్నై భారత్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన పరదేశి నాయుడు
న్యూస్ తెలుగు/అనంతపురం : ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురంలో మైక్రో బయాలజీ లో గత 18 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆదిరెడ్డి పరదేశి నాయుడు కి శుక్రవారం చెన్నై లోని భారత్ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి డాక్టరేట్ డిగ్రీ ను తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ గోవి చెజియాన్ చేతుల మీదుగా తీసుకున్నారు. డెంగ్యూ వైరస్ పైన జరిపిన పరిశోధనలకు గాను ఆదిరెడ్డి పరదేశి నాయుడు డాక్టరేట్ డిగ్రీ ను అందుకున్నారు.ఓ పక్క డాక్టర్ లకు మైక్రో బయాలజీ పాఠ్యాంశాలను బోధిస్తూ, మరోవైపు వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దునందుకుగాను, ఎన్నో సేవా కార్యక్రమాలను చేసినందుకుగాను 2019 లో అప్పటి దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ స్థాయి లో మొదటి స్థానం లో ఉత్తమ జాతీయ సేవా పథక అధికారిగా అవార్డును, సిల్వర్ మెడల్ ను, ప్రశంస పత్రాన్ని,70 వేల నగదు బహుమతిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.గత సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ ని కూడా ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణత పొందారు. భారతదేశానికి ఉత్తమ వైద్య,నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులను అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పరదేశి నాయుడుకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు అభినందనలు తెలియజేశారు.(Story : ఆదిరెడ్డి పరదేశి నాయుడు కి పీహెచ్ డీ డాక్టరేట్)