అనాధ శవానికి అంతక్రియలు..
మానవత్వం చాటుకున్న మానవ సేవా సమితి
న్యూస్‌తెలుగు/వినుకొండ: ఓ అనాధ శవానికి అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు మానవ సేవా సమితి సభ్యులు. వినుకొండ పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో అనాధ శవానికి అంతక్రియలు చేసేందుకు సీనియర్ కౌన్సిలర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు ఆధ్వర్యంలో హెల్పింగ్ హార్డ్ సమస్త యువకులు ముందుకొచ్చారు. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రి నందు మరణించిన అనాధ శవానికి వారు అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పివి సురేష్ బాబు మాట్లాడుతూ కరోనా సమయంలో మానవ సేవాసమితి, హెల్పింగ్ హార్ట్ సమస్త సభ్యులు ఎంతోమంది అనాధ శవాలకు అంతక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకుందని అన్నారు. అనాధలకు అభాగ్యులకు సమస్త సభ్యులు అండగా నిలిచి చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనాధ శవం అంతక్రియలో సమస్త సభ్యులు పువ్వాడ కృష్ణ, షేక్. సర్కార్ నాగూర్, సయ్యద్ జాబీర్, వట్టి కోటి ప్రసాద్, షేక్. యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.(Story: అనాధ శవానికి అంతక్రియలు..)