ఊరుకొండ బాధితురాలి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళకు రక్షణ కరువైందని నందిమల్ల.శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఊరుకొండ అంజనేయ స్వామిని దర్శించుకొన్న మహిళపై దుండగులు అత్యాచారం చేయడం దారుణమని అన్నారు. పవిత్ర దేవాలయాల పరిసరాలలో మహిళపై దాడి జరగడం అత్యంత దురదృష్టకరం అని ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆమెకు ఎక్సగ్రేసియ,ప్రభుత్వ ఉద్యోగం కల్పించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. గతములో దేవాలయములో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి అనేక అక్రమాలకు పాల్పడడం అతనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని రాజధాని నడిబొడ్డులో విదేశీ మహిళపై అత్యాచారాము జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని నందిమల్ల.శారద డిమాండ్ చేశారు. (Story : ఊరుకొండ బాధితురాలి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి)