Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి

ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి

ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి

ఆలస్యం, అలసత్వానికి బాధ్యత అధికారులదేనని హెచ్చరిక

న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రతివారం బుధవారం నిర్వహించే ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీలను సకాలం పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సహించబోనని, ప్రజలు మళ్లీ మళ్లీ అదే సమస్యతో రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. వినుకొండలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఈ సందర్భంగా 80 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీటిలో వివిధ కార్పొరేషన్ల లోన్లు, విద్యుత్, తాగునీరు, గృహాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా చీఫ్‌విప్ జీవీ మాట్లాడుతూ “ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రజాదర్బార్ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకే ప్రతి అర్జీని ఓపికగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుంటూ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. తమకు వస్తున్న ఆర్జీలను స్కాన్‌ చేసి కూడా పంపడం ద్వారా అధి కారుల్లో జవాబుదారీతనానిక కృషి చేస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రజాదర్బార్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామని, ఈ కార్యక్రమం స్ఫూర్తిని అర్థం చేసుకుని అధికారులు క్రియాశీలకం గా పనిచేయాలని సూచించారు. ప్రజాదర్బార్ లో చిఫ్ విప్ జీవి తో పాటు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు కే.నాగ శీను పాల్గొన్నారు.

ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి: చీఫ్ విప్ జీవీ*

ఆలస్యం, అలసత్వానికి బాధ్యత అధికారులదేనని హెచ్చరిక

ప్రతివారం బుధవారం నిర్వహించే ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీలను సకాలం పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సహించబోనని, ప్రజలు మళ్లీ మళ్లీ అదే సమస్యతో రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. వినుకొండలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఈ సందర్భంగా 80 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీటిలో వివిధ కార్పొరేషన్ల లోన్లు, విద్యుత్, తాగునీరు, గృహాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా చీఫ్‌విప్ జీవీ మాట్లాడుతూ “ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రజాదర్బార్ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకే ప్రతి అర్జీని ఓపికగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుంటూ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. తమకు వస్తున్న ఆర్జీలను స్కాన్‌ చేసి కూడా పంపడం ద్వారా అధి కారుల్లో జవాబుదారీతనానిక కృషి చేస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రజాదర్బార్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామని, ఈ కార్యక్రమం స్ఫూర్తిని అర్థం చేసుకుని అధికారులు క్రియాశీలకం గా పనిచేయాలని సూచించారు. ప్రజాదర్బార్ లో చిఫ్ విప్ జీవి తో పాటు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు కే.నాగ శీను పాల్గొన్నారు. (Story : #Site Title ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!