సీతారాముల కళ్యాణమండపానికి రేకులు పైపులు వితరణ
న్యూస్ తెలుగు/ చింతూరు : శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 6.న చింతూరు మండలం కుమ్మూరు గ్రామంలో సీతారాముల కళ్యాణం కార్యక్రమాన్ని స్థానిక ఆదివాసి గ్రామస్తులు ఏర్పాట్లలో భాగంగా బుధవారం రాముల వారి కళ్యాణానికి గాను ఏర్పాట్లు కై ఆయుర్వేద వైద్యులు జే సి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ను గ్రామస్తులు సంప్రదించి సీతారాముల కల్యాణా మహోత్సవానికి ఆహ్వానిస్తూ కళ్యాణం నిర్వహించేందుకు గాను ఏర్పాట్ల కు సాయం కోరగా 10 సిమెంటు రేకులు పది ఇనుప పైపులను కళ్యాణ నిర్వహణకు జమాల్ ఖాన్ తన వంతు సహాయంగా గ్రామస్తులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అణిగి చంద్రయ్య, నగేష్, అర్జున్, దుర్గయ్య, చిన్నోడు, ధోని, లక్ష్మణ్ ప్రసాద్ శశాంక్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story : సీతారాముల కళ్యాణమండపానికి రేకులు పైపులు వితరణ)