Homeవార్తలు'అర్జున్ S/O వైజయంతి' సినిమాని అమ్మలందరికీ అంకింతం చేస్తున్నాం

‘అర్జున్ S/O వైజయంతి’ సినిమాని అమ్మలందరికీ అంకింతం చేస్తున్నాం

‘అర్జున్ S/O వైజయంతి’ సినిమాని అమ్మలందరికీ అంకింతం చేస్తున్నాం

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా:నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’ ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు దూకుడుగా జరుగుతున్నాయి. టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. టీజర్ తోనే సినిమా థియేటర్, నాన్ ధియేటర్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా అర్జున్ S/O వైజయంతి రికార్డు క్రియేట్ చేసింది.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి IPS అధికారిగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ – నాయల్ది రిలీజ్ చేయడంతో కిక్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ నరసరావుపేటలోని రవి కళా మందిర్‌లో భారీగా తరలివచ్చి ఫ్యాన్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీని నిర్వహించారు. సాంగ్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
నాయల్ది సాంగ్ కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ మధ్య సిజలింగ్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసింది. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ ట్రాక్, రఘురామ్ రాసిన లిరిక్స్ తో సాయి అందం పట్ల కళ్యాణ్ రామ్ అభిమానాన్ని ఆకట్టుకునే శైలిలో అందంగా చిత్రీకరించారు.
సాఫ్ట్ అండ్ మెలోడీగా మొదలైన సాంగ్ క్రమంగా ఊపందుకుంది. అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ గా మారుతుంది. కళ్యాణ్ రామ్ స్టైలిష్, మోడరన్ దుస్తులలో మెరిశారు. డ్యాన్స్ ఫ్లోర్‌లో అతని కమాండింగ్ తో అదరగొట్టారు. అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నారు. శేఖర్ VJ మాష్టర్ హై-ఎనర్జీ కొరియోగ్రఫీ చేశారు. అద్భుతమైన సాంప్రదాయ చీరలో ధరించిన సాయి మంజ్రేకర్, కళ్యాణ్ రామ్ ఎనర్జీని మ్యాచ్ చేశారు.
ఫస్ట్ సాంగ్ కి వచ్చిన ఇన్స్టంట్ అండ్ ట్రెమండస్ రెస్పాన్స్ తో మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ ప్రారంభం అయ్యాయి. ఈ పాట మ్యూజిక్ చార్టులలో టాప్ సాంగ్ గా ట్రెండ్ అవుతోంది. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మిరాజు ఎడిటర్. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మొట్టమొదటి ఈవెంట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నేను పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ సక్సెస్ మీట్ కి వచ్చాను. ఈ వేడుక చూస్తుంటే సాంగ్ లాంచ్ ఈవెంట్ లా లేదు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. ప్రతిసారి మీ మన్ననలని పొందడానికి ప్రయత్నిస్తుంటాను. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పినట్లు అతనొక్కడే సినిమాల ఈ సినిమా కూడా మరో 20 లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్ర చేసిన విజయశాంతి గారు ఆ క్యారెక్టర్ ని ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా చేయడం జరిగింది. విజయశాంతి గారికి ధన్యవాదాలు. అమ్మలని గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఈ సినిమాని అమ్మలందరికీ అంకితం చేస్తున్నాం. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. జోహార్ ఎన్టీఆర్. జోహార్ హరికృష్ణ. జై హింద్’అన్నారు.
డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నేను ముందు దర్శకుడుగా కంటే ఒక ప్రేక్షకుడిని, మీలానే మాస్ థియేటర్స్ లో విజల్స్ కొడుతూ సినిమాలు చూశాను. నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ గారిని ఎలా చూడాలని కోరుకుంటారో ఈ సినిమాలో అలా ఉంటారు. పల్నాటి పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్ లో ఉంటుంది. కళ్యాణ్ రామ్ గారి, నిర్మాతలకి, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ కి, మా టీమ్ అందరికీ ధన్యవాదాలు.
నిర్మాత అశోక్ వర్ధన్ ముప్ప మాట్లాడుతూ. ఈ సాంగ్ ని పల్నాడులో లాంచ్ చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ వేడుక చూస్తుంటే సాంగ్ లాంచ్ ఈవెంట్ లా లేదు మా మూవీ సక్సెస్ ఈవెంట్ లా ఉంది. ఈ సినిమాకి ప్రాణం కళ్యాణ్ రామ్ గారు. మాది కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త డైరెక్టర్ . మమ్మల్ని కళ్యాణ్ రామ్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. డైరెక్టర్ ప్రదీప్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందరికీ థాంక్యు’అన్నారు.
చదలవాడ ఆదిత్య బాబు మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సాంగ్ లాంచ్ ఈవెంట్ నరసరావుపేటలో జరగడం, కళ్యాణ్ రామ్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. టీజర్ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. పటాస్, బింబిసార లా ఇది కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరినీ కంగ్రాచ్యులేషన్స్’అన్నారు.
తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ & ఇతరులు.
సాంకేతిక సిబ్బంది:
రచయిత & దర్శకుడు: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
DOP: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
బహుమతులు: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
PRO: వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో (Story : ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమాని అమ్మలందరికీ అంకింతం చేస్తున్నాం)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!