ఉచిత మంచినీటి ప్లాంట్ ప్రారంభం చేసిన జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని ఐరిష్ రెసిడెన్సి కన్వెన్షన్ హాల్ ను ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు పాల్గొని ఉచిత మంచినీటి ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎంతో ఆధునికంగా రూపుదిద్దుకున్న ఐరిష్ కన్వెన్షన్ హాల్ ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. విజయవాడ నుండి వచ్చిన విద్యార్థినీలు భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కాంతారావు, జనసేన పార్టీ నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు, పులిపాటి రామారావు, పువ్వాడ కృష్ణ, పీవీ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు. (Story :ఉచిత మంచినీటి ప్లాంట్ ప్రారంభం చేసిన జీవి)