కళాకారులకు సన్మానం
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రపంచ రంగస్థల కళాకారుల వారోత్సవాల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గ ప్రాంత కళాకారుల సంఘ 6వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సీనియర్ కళాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాషువా సమాఖ్య అధ్యక్షుడు చిలకల జాన్ సుందరరావు, పౌరాణిక నాటకానికి చెందిన రామాపురం వేంకటేశ్వర్లు, సీనియర్ హార్మోనియం వాయిద్య కళాకారుడు బద్దుల ల వీరాంజనేయులు, హరికధా భాగవతారిణి సిద్దు. నాగమల్లేశ్వరి, సన్మానించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ ప్రాంత కళాకారుల సంఘ అధ్యక్షుడు కుంపటి. మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరాబత్తుని. వెంకటేశ్వరావు, సర్నె పోగు. ఎజ్రా, ప్రకృతి చెన్నుపల్లి. గోవింద్, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అనంతరం “రౌడీ సింహాలు” నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు ప్రకాశం బాపట్ల జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ వీక్షించి నాటకాలకు వన్నె తగ్గలేదని నిరూపించారు. (Story : కళాకారులకు సన్మానం)