ఎన్టీఆర్ ఆశయ సాధనకై అందరం ఐక్యంగా కలిసి పని చేద్దాం..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో జమాల్ ఖాన్ పిలుపు
న్యూస్ తెలుగు/చింతూరు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చింతూరు మండలం కేంద్రంలోని నిమ్మలగూడెం గ్రామంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సీ టి ట్రస్ట్ చైర్మన్ ఎండి జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరములు కావస్తున్న నేపథ్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపు ఉంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీని ఆనాడు నందమూరి తారక రామారావు కేవలం ఆరు నెలల్లో పార్టీని స్థాపించి తెలుగు తేజం ఉట్టిపడేలా ప్రాంతీయ పార్టీగా విజయదుందబి మ్రోగించారన్నారు.ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా కొరినారు. అనంతరం టిడిపి పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్నారు. ఒకరికొకరు పంచుకొని పార్టీ ఆవిర్భావ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పి.సల్మన్రాజు.ముత్యాల శ్రీరామ్,పొదిలి రామారావు సురేష్ చౌదరి, ఓ.నరసింహారావు,మాజీ సర్పంచ్.సోడీ శ్రీనివాసరావు, తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ఎన్టీఆర్ ఆశయ సాధనకై అందరం ఐక్యంగా కలిసి పని చేద్దాం..)