తెలంగాణ ఉన్నంత వరకు దాశ రధి గారి పేరు ఉంటుంది
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ ఉన్నంత వరకు దాశ రధి గారి పేరు ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో దాశరధి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావంతమైన రచనలు చేశారుఅని , యాభై సంవత్సరాలు సాహిత్యం లో ఉన్నారుఅని అన్నారు. సాహిత్యం లో చేపట్టనటువంటి ప్రక్రియ నే లేదు అని అన్నారు. ఆంధ్ర మహాసభ లో, కమ్యూనిస్ట్ పార్టీ లో పని చేశారుఅని వ్యవస్థ తో, రాజ్యం తో రాజీ పడకుండా ఆయన పని చేశారు అని అన్నారు. భక్తి పాటలు, శృంగార, సందేశం ఇచ్చే పాటలు రచించారు అని, దాశరధి గారికి నిజమైన నివాళులు కెసిఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం అర్పించిందిఅని అన్నారు.(Story : తెలంగాణ ఉన్నంత వరకు దాశ రధి గారి పేరు ఉంటుంది )