Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పాస్టర్ అనుమానాస్పద మరణం పై నిరసన

పాస్టర్ అనుమానాస్పద మరణం పై నిరసన

0

పాస్టర్ అనుమానాస్పద మరణం పై నిరసన

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణాన్ని హత్యా నేరంగా పరిగణించి కేసు దర్యాప్తు చేయాలి
కరువది సుబ్బారావు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

న్యూస్ తెలుగు/ వినుకొండ : రాజమండ్రి వద్ద మరణించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూస్తున్నారని, చూసిన ప్రతి ఒక్కరూ ఇది హత్య అని అంటున్నారని కావున ప్రవీణ్ కుమార్ మరణాన్ని హత్య నేరంగా పరిగణించి కేసు రిజిస్టర్ చేసి సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు వినుకొండ పట్టణానికి దళిత హక్కుల పోరాట సమితి మహాసభ సందర్భంగా వచ్చిన ఆయన శివయ్య స్తూపం సెంటర్లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ మరణాన్ని హత్యా నేరంగా పరిగణించి కేసు దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా దళిత బలహీన మైనారిటీ వర్గాలపై దాడులు, అత్యాచారాల, హత్యలు నిరంతరం కొనసాగుతున్నాయని , కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి రెండింతలు అయ్యాయని ఆయన విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత మైనారిటీ బలహీన వర్గాల పై జరుగుతున్న దాడులను అరికట్టుటలో పూర్తిగా వైఫల్యం చెందాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతూ మైనారిటీ ప్రజల హక్కులు కాపాడుటలో తాత్సార వైఖరి అవలంబిస్తుందని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేద ప్రజలకు కొన్ని హక్కులను కొన్ని రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని, వాటిని అమలు చేసి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఈ ప్రభుత్వాలు ఆ న్యాయ సూత్రాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన దుయ్యబట్టారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు బూదాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది మొదలుకొని దేశం యావత్తు క్రిస్టియన్ లపై ముస్లింలపై దళిత బలహీనవర్గాలపై దాడులు యదేచ్ఛగా కొనసాగుతున్నాయని అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో వారిని భయకంపితులు చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ లోను ఇటీవల జరిగిన మణిపూర్ రాష్ట్రంలోని హింసాగ్ని మైనారిటీ తెగలు కుకీస్ పై మైటేయులు జరిగపిన దాడులు దానికి నిదర్శనం అన్నారు. మణిపూర్ లో సుమారు 300 మందిని హత్య చేసి వారి గృహాలు తగులు పెట్టి మహిళలను బహిరంగంగా వివస్త్రలుగా నగ్నంగా ఊరేగించి అత్యంత దారుణంగా అత్యాచారం చేశారని దీనిని మన దేశ అత్యున్నత పదవులలో ఉన్న ప్రధాని హోం మంత్రి కనీసం పెదవి విప్పి మాట్లాడలేదని పరామర్శించలేదని వారు విమర్శించారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని సైతం పూర్తిగా మార్చి వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దీన్ని ప్రజాతంత్ర వాదులు లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని కాపాడే మరో పోరాటానికి సిద్ధం కావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల కమిటీ నాయకులు వెంకటేశ్వర్లు, చౌటుపల్లి నాగేశ్వరరావ, బొంత నాగేశ్వరరావ, సోమవరపు దావీద, ధూపాటి మార్క, మరియదాస, సోడాల సాంబయ్య, మస్తాన, విప్పర్ల వెంకట్వర్లు, పౌలు, వెంకట్రావు, అభిషేక్, తదితరులు పాల్గొన్నారు. (Story: పాస్టర్ అనుమానాస్పద మరణం పై నిరసన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version