మావోయిస్టులకు వ్యతిరేకం గా ఆదివాసి పోస్టర్ ల ప్లాకార్డ్ ల ప్రదర్శన
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి గ్రామంలోని వారాంతపు సంతలో శుక్రవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలు పోస్టర్ లు, ప్లాకార్డ్స్ ల తో ప్రదర్శన చేశారు. అభివృద్ధికి ఆటంకంగా రావద్దు. మావోయిస్టులు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలు పొందలేకపోతున్న మాకు, ఇప్పుడిప్పుడే పొందుతున్నాము. ప్రభుత్వ పథకాలు ఆపొద్దు. మా ప్రశాంత జీవితంలోకి అడుగు పెట్టి అలజడి సృష్టించవద్దని కోరుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story : మావోయిస్టులకు వ్యతిరేకం గా ఆదివాసి పోస్టర్ ల ప్లాకార్డ్ ల ప్రదర్శన )