గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణం ప్రతుల విడుదల
న్యూస్ తెలుగు / వినుకొండ : అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణం గోడ ప్రతులను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వా చీప్ విప్ జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జివి మాట్లాడుతూ. నిత్య అన్నదానం చేస్తున్న ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవకులు జాజులమాల్యాద్రి ప్రత్యేకంగా అభినందించారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన కార్యక్రమాలను ఆలయం ఆశ్రమ నందు ఏర్పాటు చేస్తున్న సేవకులను ప్రభుత్వ ఏజిపి ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు అభినందించారు. సీనియర్ న్యాయవాది పొట్లూరి సైదారావు మాట్లాడుత. ఆధ్యాత్మిక లైబ్రరీ, గోసాల ఆధ్యాత్మిక ప్రవచనాలు సత్సంగాలు లక్ష్మీనరసింహస్వామి కళావేదిక శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ద్యాన మందిరం ఈ ఆశ్రమ నందు ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. కౌన్సిలర్ పివి సురేష్ బాబు మాట్లాడుతూ. 10 సంవత్సరాలుగా అన్నదానం చేయడం సామాన్యమైన విషయం కాదు అటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో చేస్తున్న భక్త బృందం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి మాట్లాడుతూ. ఉగాది పండుగ సందర్భంగా 30వ తేదీన ఈ కార్యక్రమాలన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ ముప్పాల జ్ఞానేశ్వర్ రావు, పొట్లూరి సైదారావు, పివి సురేష్ బాబు , మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రమణారావు, కృష్ణవేణి , రామా వెంకటేశ్వర్లు, వై నాగలక్ష్మి, గడ్డం బ్రమరాంబ, పిచ్చయ్య, భక్త బృందం పాల్గొన్నారు. (Story : గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణం ప్రతుల విడుదల)