Home వార్తలు అల్లూరి సమాధిని సందర్శించిన ప్రముఖ రచయిత యండమూరి, దర్శకుడు కృష్ణవంశీ  !!!

అల్లూరి సమాధిని సందర్శించిన ప్రముఖ రచయిత యండమూరి, దర్శకుడు కృష్ణవంశీ  !!!

0

అల్లూరి సమాధిని సందర్శించిన ప్రముఖ రచయిత యండమూరి, దర్శకుడు కృష్ణవంశీ  !!!

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సినీ దర్శకుడు కృష్ణవంశీ సోమవారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి విచ్చేసారు. స్థానిక నేనుసైతం చారిటబుల్ ట్రస్ట్ పౌండషన్ వ్యవస్థాపకుడు కుసిరెడ్డి శివతో కలిసి అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు ఉన్న పార్కును సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు.
ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ…
కృష్ణవంశీ గొప్ప దేశ భక్తుడు, ఆయన అల్లూరి సమాధి వద్ద మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి నమస్కారం చెయ్యడం ఆయన భక్తి భావానికి నిదర్శనీయం, ఆ క్షణంలో ఆయన దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమా గుర్తు వచ్చింది, దేశభక్తి కలిగినటువంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా కృష్ణవంశీ నిలిచారని అన్నారు.
దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ…
ఎన్నో ఏళ్లుగా అల్లూరి నడయాడిన ప్రాంతాలను సందర్చించాలనే తపన ఉండేది, నేటితో ఆ కోరిక తీరింది. గోకరాజు నారాయణ రావు అనే ఒక పత్రిక ఎడిటర్ అల్లూరి చరిత పై 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆకుపచ్చ సూర్యోదయం అనే పుస్తకం రాశారు, అది చదివిన తరువాత అల్లూరి సీతారామరాజు పోరాటం, కొనసాగించిన ప్రదేశాలను ఎలాగైనా సందర్శించాలనే పట్టుదల పెరిగిందన్నారు. అవకాశం ఉన్నంత మేర అల్లూరి చరిత్రతో మంచి చిత్రాన్ని తెరకెకెక్కించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు.
కార్యక్రమం అనంతరం నేను సైతం చారిటబుల్ ట్రెస్ట్ ఆధ్వర్యంలో కొయ్యురు మండలంలో నివాసం ఉంటున్న అల్లూరి ప్రధాన అనుచరుడు గంటం దొర కుటుంభ సభ్యులను పరామర్శించి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేనుసైతం వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివ పాల్గొన్నారు. (Story : అల్లూరి సమాధిని సందర్శించిన ప్రముఖ రచయిత యండమూరి, దర్శకుడు కృష్ణవంశీ  !!!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version