నిరుద్యోగులకు శుభవార్త
ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ ఫిక్స్
చంద్రబాబు కీలక నిర్ణయం
న్యూస్ తెలుగు/ అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకాల్లో ఒక్కటైన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఆయన ఆదేశాలిచ్చారు. ఏప్రిల్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో ఆయన ఆదేశించారు. 10 నెలల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది పండుగలాంటి వార్తే. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని వెల్లడిరచారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక 16,317 పోస్టులతో డీఎస్సీ ప్రకటించింది. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవ్వగా ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. ఇదే అదునుగా మరో ఏపీ టెట్‌ను ప్రభుత్వం నిర్వహించింది. ఆ పరీక్షా ఫలితాలు పూర్తయ్యాక మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ అంశం ఆటంకంగా మారింది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా కలెక్టర్లు డీఎస్సీకి నోటిఫికేషన్లు జారీజేస్తారు. కలెక్టర్లు చైర్మన్లుగా ఉండి ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,317 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. అందులో ఎస్జీటీ 6,321, స్కూల్ అసిస్టెంట్స్ 725, టీజీటీ 1,781, పీజీటీ 286 ఉన్నాయి. మరిన్ని ఖాళీలు ఏర్పడితే వాటిని ఈ మెగా డీఎస్సీలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలకు సన్నద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతో ఆనందంగా ఉన్నారు. (Story: నిరుద్యోగులకు శుభవార్త)
Follow the Stories:
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!