ఆస్తి, నల్ల పన్నుల వసూళ్లు సహా ఎల్ఆర్ఎస్ పేమెంట్ లపై దృష్టి సారించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నల్ల పన్నుల వసూళ్లు సహా ఎల్ఆర్ఎస్ పేమెంట్ లపై దృష్టి సారించాలని, అదేవిధంగా లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. మంగళవారం అమరచింత మున్సిపాలిటీ కార్యాలయంలో ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో ప్రాపర్టీ, నల్లా పన్నుల వసూళ్ల వేగం పెంచాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని సూచించారు. బిల్ కలెక్టర్ ల తో పాటు మున్సిపాలిటీలో సిబ్బందిని అందరినీ పన్ను వసుల కోసం కేటాయించి వేగంగా వసూళ్లు చేయాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పన్నుల వసూళ్లపై పనిచేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల కోసం వెళ్లే సిబ్బంది వద్ద తప్పనిసరిగా అత్యధిక బకాయిలు ఉన్న వారి జాబితా ఉండాలని సూచించారు. బకాయిలు ఉన్నవారికి నోటీసులు పంపించాలని పోస్ట్ ద్వారా, మరియు డోర్ టు డోర్ వెళ్లినప్పుడు కూడా నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు మున్సిపాలిటీల యొక్క ఆదాయము, ఖర్చులపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో అమరచింత మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్ తదితరులు ఉన్నారు. (Story ; ఆస్తి, నల్ల పన్నుల వసూళ్లు సహా ఎల్ఆర్ఎస్ పేమెంట్ లపై దృష్టి సారించాలి)