రైతుల పంటలను కాపాడాలి : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతుల రబీ పంటలు రక్షించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోర్ల కింద రైతులు రబీలో వరి సాగు చేశారన్నారు. కొందరు ప్రాజెక్టుల కాలువలపై మోటార్లు వేసుకొని వరి సాగు చేశారన్నారు. ప్రస్తుతం కొన్ని వరిచేలు కోతకు రాగా మరికొన్ని వరిచేలు కొనవడ్లు పట్టాయని, మరికొన్ని పాలు పోసే దశలో ఉన్నాయన్నారు. 25 రోజులు సక్రమంగా కరెంటు సరఫరా చేస్తే రైతుల పంటలు చేతికి వస్తాయన్నారు.జిల్లాలో పలుచోట్ల లో వోల్టేజ్ కారణంగా బోర్ల నీరు పంటలకు అందటం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారన్నారు. వనపర్తి మండలం పెద్దగూడెం లో నీరు పారక పంటను పశువులకు వదిలేసారన్నారు. నాచహళ్లి సబ్ స్టేషన్ పరిధి మూడు గ్రామాలలో లో వోల్టేజ్ కారణంగా పంటలకు నిరంతరం లేదని మంగళవారం రైతులుసబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారన్నారు. జిల్లాలో పలుచోట్ల లోబోల్టేజ్ సమస్య వల్ల పంటలకు మీరు అందటం లేదని చెబుతున్నారన్నారు. నాణ్యమైన విద్యుత్తు అందించి పంటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా విద్యుత్తు యంత్రాంగాన్ని కదిలించాలన్నారు. ప్రభుత్వం తాత్సారం చేస్తే మరికొన్నిచోట్ల పంటలు ఎండి ఆందోళన బాట పట్టే పరిస్థితి ఉందన్నారు. పంటలు ఎండితే తప్పని పరిస్థితుల్లో రైతుల పక్షాన రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. అంతేగాక ఇటీవల వడగండ్ల మనకు వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వారిని ఆదుకోవాలని అన్నారు. వనపర్తి మండలం పెద్దగూడెంలో 100 ఎకరాల్లో వడగండ్ల వానకు పంట దెబ్బతిన్నని కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో 170 ఎకరాల్లో పంట దెబ్బతిన్నని రైతులు స్వయంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారన్నారు. నష్టపోయిన రైతాంగానికి తక్షణం సహాయం అందించాలన్నారు. వనపర్తి పట్టణంలో ఇండ్లకు కరెంటు కోతలు పెరిగి ప్రజలు వేసవిలో ఇబ్బందులు పడుతున్నారని, కోతలు లేని కరెంటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, రమేష్, మోష, గోపాలకృష్ణ, ఎర్రకురుమన్న, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు
వనపర్తి లో సిపిఐ శతజయంతి ఉత్సవాలు మార్చి 23న మిగితాయని జిల్లా కార్యదర్శి కె విజయరాములు అన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు కృషికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించారన్నారు. దాతలు తమ వంతు సహాయం చేశారన్నారు. ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ సభ విజయవంతమైందని, విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. (Storyn: రైతుల పంటలను కాపాడాలి : సిపిఐ)