మహాకవి డాక్టర్.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : సాహితీ కళావేదిక మరియు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యములో మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి గారి అధ్యక్షతన 29న దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు మహాకవి డాక్టర్.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడతాయని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ తెలిపారు. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్య రచనలు ఈ తరానికి రాబోవు తారలకు స్ఫూర్తిదాయకం కావాలని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని సాహితీవేత్తలు,కవులు,కళాకారులు ,తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,వాకిటి.శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, ఉంగ్లం.తిరుమల్, మహేష్ వర్ రెడ్డి,నందిమల్ల.అశోక్, పలుస.శంకర్ గౌడ్,నారాయణ్ రెడ్డి,బైరోజు చంద్రశేఖర్,గంధం.నాగరాజు,చిట్యాల.రాము, జోహేబ్బ్ హుస్సేన్,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : మహాకవి డాక్టర్.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు)