థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా “28°C”
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా: “పొలిమేర” చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా “28°C” ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది. “28°C” చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ – “28°C” సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా సాంగ్స్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ – “28°C” సినిమా గురించి మాట్లాడాలంటే ఎమోషనల్ అవుతాము. ఈ సినిమాను 2018లో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఓటీటీకి ఇవ్వాలనే ప్రపోజల్స్ వచ్చాయి. కోవిడ్ టైమ్ లో సినిమాను రిలీజ్ చేయలేకపోయాం. అయితే మా సినిమాను ఓటీటీ కంటే బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురావాలనే పట్టుదలగా ఉన్నాం. నా కో ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్ చేశారు. మేమంతా వెయిట్ చేసి థియేట్రికల్ రిలీజ్ కు ఏప్రిల్ 4న తీసుకొస్తున్నాం. సినిమాను థియేటర్స్ లో చూసిన ఫీల్ వేరుగా ఉంటుంది. “28°C” సినిమా మీ అందరికీ నచ్చి మా ఎఫర్ట్స్ కు మంచి రిజల్ట్స్ ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ డా.అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ – దర్శకుడిగా నేను చేసిన తొలి సినిమా “28°C”. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఎంతో ఉద్వేగంగా ఉంది. ప్రతి దర్శకుడికి తన తొలి సినిమా ఇలా చేయాలి అలా చేయాలనే కోరికలు ఉంటాయి. నేనూ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాను. కానీ నేను ఇది నా తొలి సినిమా అని గర్వంగా చెప్పుకోగలను. ఫ్యూచర్ లో నేను ఎన్నో సూపర్ హిట్స్ తీయొచ్చు. నా ఫిల్మోగ్రఫీలో కొన్ని పేజీలు ఉండొచ్చు కానీ “28°C” మూవీ మాత్రం నాకు చాలా స్పెషల్. ఈ సినిమాకు నేను చేసిన జర్నీ గురించి ఆ తర్వాత ఒక పుస్తకమే రాస్తాను. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హీరో హీరోయిన్స్ జంట మధ్య అనుకోని ఓ సమస్య వస్తే దానిని వారు ఎలా ఫేస్ చేశారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాలు మీరు ఎక్స్ పెక్ట్ చేయలేరు. అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమాను చూసిన నా ఫ్రెండ్ వంశీ నందిపాటి ఇంతమంచి మూవీని రిలీజ్ చేయకుండా ఎలా ఉన్నారని అడిగి తనే రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో నాకు హీరో నవీన్ చంద్ర, ప్రొడ్యూసర్ అభిషేక్ చాలా సపోర్ట్ చేశారు. ఫైనల్ గా ఏప్రిల్ 4వ తేదీన మా “28°C” చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరినీ సినిమా ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నా. పొలిమేర 2 సినిమా కంటే అన్ని విషయాల్లో 15 రెట్లు బిగ్ స్కేల్ లో పొలిమేర 3 ఉంటుంది. కథ చాలా బాగా వచ్చింది. సీజీ, ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తాం. అన్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ – “28°C” సినిమా మా టీమ్ అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ ఇచ్చింది. 2018లో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ నాకు ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఇంప్రెస్ అయ్యాను. 2019లో సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే కోవిడ్ వల్ల అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో మీ అందరికీ తెలుసు. ఓటీటీ ఆఫర్స్ వచ్చినా మా ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ ఇవ్వలేదు. థియేటర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. డాక్టర్స్ అయిన ఓ జంట ప్రేమ కథ ఇది. చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ, కథలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. “28°C”లోనే హీరోయిన్ క్యారెక్టర్ ను ఉంచాలి లేకుంటే తనకు ప్రాబ్లమ్ అవుతుంది. ఈ పాయింట్ విన్నప్పుడు ఎగ్జైటింగ్ గా అనిపించింది. వంశీ నందిపాటి గారు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. మా సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని నమ్ముతున్నాం. ఇది 2018లో చేసిన సినిమా అయినా ఇప్పుడు కూడా ఫ్రెష్ మేకింగ్ ఫీల్ కలిగిస్తుంది. ఏప్రిల్ 4వ తేదీన థియేటర్స్ లో “28°C” సినిమాను చూడండి మీకు బాగా నచ్చుతుంది. అన్నారు.
నటీనటులు – నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, వి జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్ర, అభయ్ బేతిగంటి, దేవియాని శర్మ, సంతోషి శర్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ – అనూష ఇరగవరపు, అభినయ చౌదరి, రేఖ బొగ్గరపు
ఎడిటర్ – గ్యారీ బీహెచ్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – శ్రీచరణ్ పాకాల
మ్యూజిక్ – శ్రావణ్ భరద్వాజ్
బ్యానర్ – వీరాంజనేయ ప్రొడక్షన్స్
కో ప్రొడ్యూసర్స్ – సంజయ్ జూపూడి, విక్రమ్ జూపూడి
ప్రొడ్యూసర్ – సాయి అభిషేక్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
దర్శకత్వం – డా. అనిల్ విశ్వనాథ్ (Story : థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా “28°C”)