హైదరాబాద్‌లో ఘనంగా యూఎస్‌జీసీఐ గ్లోబల్ బిజినెస్ సమిట్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లీలాహోటల్లో యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (యూఎస్‌జీసీఐ) ఆధ్వర్యంలో గ్లోబల్ బిజినెస్ సమిట్ 2025 నిర్వహించారు. సామాజిక పెట్టుబడులు, ద్వైపాక్షిక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ వృద్ధిని పెంపొందించడం అనే థీమ్‌తో సాగిన ఈ ముఖ్యమైన కార్యక్రమం.. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను పునర్నిర్వచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు డాక్టర్ డాక్టర్ మార్క్ బర్న్స్ యూఎస్‌జీసీఐ ఇండియా చాప్టర్‌ను అధికారికంగా ప్రారంభించడం ఈ సదస్సులో ప్రధానాంశం. అమెరికా, భారత్ మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి, ద్వైపాక్షిక వాణిజ్య అవకాశాలను పెంపొందించడానికి ఈ ప్రయోగం వ్యూహాత్మక ముందడుగు. యుఎస్‌జీసీఐ ఇండియా చాప్టర్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ సోలమన్ గట్టు కీలకోపన్యాసం చేస్తూ, సుస్థిరవృద్ధిని పెంపొందించడంలో బాధ్యతాయుతమైన ప్రపంచ వాణిజ్యం కీలకపాత్రను నొక్కిచెప్పారు. (Story : హైదరాబాద్‌లో ఘనంగా యూఎస్‌జీసీఐ గ్లోబల్ బిజినెస్ సమిట్)