Homeవార్తలుడిజిటల్‌ ముందడుగే దంతవైద్య భవిష్యత్తు

డిజిటల్‌ ముందడుగే దంతవైద్య భవిష్యత్తు

డిజిటల్‌ ముందడుగే దంతవైద్య భవిష్యత్తు

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: డిజిటల్‌ ముందడుగు, బయో-ఇన్‌స్పైర్డ్‌ మెటీరియల్‌ విధానాల చేరికతో ఆధునిక దంతవైద్యం గణనీయంగా దూసుకెళ్తోందని అపోలో డెంటల్‌ క్లినిక్‌ వైద్యులు పేర్కొన్నారు. క్యాడ్‌/క్యామ్‌ టెక్నాలజీ, ఇంట్రాఓరల్‌ స్కానర్లు, 3 డి ప్రింటింగ్‌ ఫలితంగా ప్రోస్టోడాంటిస్టులు దీర్ఘకాలిక ఫలితాలతో అత్యంత ఖచ్చితమైన, సమర్థవంతమైన చికిత్సలను అందిస్తున్నారన్నారు. దీని ద్వారా అత్యంత వ్యక్తిగత చికిత్సలను చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చికిత్స విధానాల్లో ఈ సాంకేతికత వినియోగంలోనే దంతవైద్యం భవిష్యత్తు ఉందని అపోలో డెంటల్‌ క్లినిక్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌, ప్రోస్టోడాంటిస్ట్‌, ఇంప్లాంటాలజిస్ట్‌ డాక్టర్‌ షాఫత్‌ అహ్మద్‌ అన్నారు. సాంప్రదాయ ఇంప్రెషన్‌ తయారీ స్థానంలో డిజిటల్‌ ఇంట్రా-ఓరల్‌ స్కానర్లు వచ్చాయి. దీంతో ఖచ్చితత్వం పెరిగింది. క్యాడ్‌/క్యామ్వల్లఫిట్‌, ఫంక్షన్‌ లేదా ముఖసౌందర్యంలో రాజీపడకుండా క ృత్రిమ పళ్లను వేగంగా తయారు చేయగలుగుతున్నాం. త్రీడీ ప్రింటింగ్‌ వల్ల ఈ రంగం మరింత ఉన్నతంగా మారింది. తక్కువ వ్యర్థాలతో కస్టమైజ్డ్‌ క్రౌన్లు, బ్రిడ్జిలు, దంతాలు, సర్జికల్‌ గైడ్లను వేగంగా సృష్టించగలుగుతున్నామని తెలిపారు.(Story : డిజిటల్‌ ముందడుగే దంతవైద్య భవిష్యత్తు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!