యూకే అండ్ కోతో రీపోస్ భాగస్వామ్యం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: మిడ్-టు-ప్రీమియం మ్యాట్రెస్ పరిశ్రమలో ప్రాచుర్యం పొందిన రీపోస్ మ్యాట్రెస్, తన వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళేందుకు ప్రముఖ కుటుంబవ్యాపార సలహాసంస్థ యూకే అండ్ కో వారితో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మ్యాట్రెస్ పరిశ్రమలో దశాబ్దకాల అనుభవము, పదిహేడు రాష్ట్రాలలో నిర్వహించబడే కార్యకలాపాలతో, రీపోస్ మ్యాట్రెస్ తన అభివృద్ధి, విస్తరణ దశలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ భాగస్వామ్యాన్ని యూకే అండ్ కో వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపార సలహాదారు, ఉల్లాస్ కామత్ ముందుకు నడిపిస్తారు. ఈయన నాయకత్వంలో, యూకే అండ్ కో. ఉత్పత్తి సాంకేతికత, అమ్మకాలు, మార్కెటింగ్, పంపిణి, ఆర్థిక ప్రణాళికలలో అనేక వ్యూహాత్మక ప్రమేయాల ద్వారా చాలా వ్యాపారాలను కొత్త శిఖరాలకు చేరేందుకు సహాయపడిరది (Story : యూకే అండ్ కోతో రీపోస్ భాగస్వామ్యం)