ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. (Story : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి)