ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి యూనివర్సిటీ స్థాయి జట్టుకు ఎంపిక
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బోధనం శ్రీను అంతర విశ్వవిద్యాలయ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్ బాల్ పోటీలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరపున యూనివర్సిటీ స్థాయి జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.శ్రీనివాసరావు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనెల 20, 21 తేదీలలో చోడవరం లోని ఆర్ వి ఆర్ జె సి ఇంజనీరింగ్ కాలేజీ నందు జరిగిన అంతర్ కళాశాలల బేస్ బాల్ పోటీలలో పాల్గొని తన ప్రతిభ చూపించి యూనివర్సిటీ స్థాయి జట్టుకు ఎంపిక అవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ మేరకు బోధనం శ్రీను నీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్చార్జి ఎం. జగదీష్, ఫిజికల్ డైరెక్టర్ జి.వెంకటాచారి, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం అభినందనలు తెలిపారు. ఎంపికైన విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ చండీగర్ లో జరగనున్న అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. (Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి యూనివర్సిటీ స్థాయి జట్టుకు ఎంపిక)