భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం యువత ఉద్యమించాలి..
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి
మారుతీ వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
బూదాల శ్రీనివాసరావు సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి..
న్యూస్ తెలుగు / వినుకొండ : బ్రిటిష్ పాలకులు అంతం కావాలని, తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన సర్దార్ భగత్ సింగ్, భారతదేశ యువతకు స్ఫూర్తిగా నిలవాలని, ఆయన ఆశయాల సాధన కోసం యువత ముందుకు రావాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. ఆదివారం నాడు వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్ లో సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అఖిలభారత యువజన సమాఖ్య, సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ ల ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ. చిన్న వయసులోనే ఆ ముగ్గురు వీరులు దేశం కోసం ప్రాణాలర్పించి అమరులయ్యారని తెల్ల దొరలు విధించిన ఉరిశిక్షను ఆనందంగా స్వీకరించి మార్చి 23- 1931 ఉరితాడును సైతం ముద్దాడి ప్రాణాలర్పించిన రోజును మనం వారి త్యాగాల గురించి స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని, 23 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన ఈ ముగ్గురు వీరులు నాటి తరానికి కాదు నేటి యువతకు కూడా ఆదర్శం గా తీసుకోవాలని ఉరి కంభం ఎక్కడానికి ముందు కూడా తమ ముఖంలో చిరునవ్వు చెరగనివ్వని ఈ యోధులు దేశం కోసం చావును కూడా ఎంతో ఆనందంగా స్వీకరించారని ఆయన అన్నారు. సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. నేటి యువతకు భగత్ సింగ్ పోరాట పటిమ ఒక దిక్సూచిగా, ఆదర్శంగా ఉండాలని దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులు దేశ యువతరానికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాము అని నిస్వార్థం, త్యాగనిరతి, దేశభక్తి, నేటి రాజకీయాలలో పూర్తిగా కొరవడినాయని దేశ రాజకీయాలలో కి స్వార్థ చింతనలేని యువకులు రావాలని చైతన్యవంతమైన పోరాటాలతో నిర్దిష్టమైన పోరాటాలతో ప్రజా సమస్యల పరిష్కారాల కొరకు రాజకీయాలలో అడుగుపెడితే కమ్యూనిస్టు పార్టీ వారిని స్వాగతిస్తుంద ని వారిని ఆదరించి పార్టీ ప్రజాసంఘాలలో ప్రజా సేవకు నిమగ్నులయ్యే విధంగా తయారు చేస్తామని ఆయన అన్నారు.
మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల పై సిపిఐ ప్రచార ఆందోళన యాత్ర ప్రారంభం : మారుతీ వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి....
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి దేశవ్యాప్త పిలుపుమేరకు మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి రోజు నుండి ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై బిజెపి మతోన్మాద పోకడలపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై కక్ష సాధింపు విధానాలు ప్రతిపక్షాలపై వివిధ రాష్ట్రాలలో సిబిఐ, ఈడి కేసులతో భయకంపితులను చేయుచు దేశ రాజకీయాలని తమ కనుసైగలలో నడవాలని భయకంపితులను చేస్తూ కక్ష సాధింపు విధానాలను చేస్తున్న బిజెపి విధానాల పై ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాలను కలుషితం చేస్తోందని దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని నడపాలని చూస్తున్నదని దీనిని దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గత ఎన్నికలలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాయమాటలతో మోసం చేసిన సంగతిని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని ఆయన అన్నారు. అటువంటి బిజెపి పార్టీకి రాష్ట్రంలో మరల ఎన్నికలలో నిలబడుటకు అవకాశం కల్పించిన నేటి అవకాశవాద కూటమి రాజకీయ పార్టీలు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. బిజెపి అంటే అదొక పెద్ద మహా వృక్షమని ఆ వృక్షం కింద చిన్న మొక్కలను కూడా బ్రతకనివ్వదని మనం కళ్ళ ఎదురుగా చూస్తున్న శాస్త్రీయమైన విధానాన్ని మరిచిపోరాదన్నారు. అనేక రాష్ట్రాలలో బిజెపితో కలిసిన వారు ఏమైనారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఎవరి రాజకీయాలు వారికి ఉంటాయి. కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకుంటూ బిజెపిపై పోరాటం చేయనిదే ఫలితాలు సాధించలేరని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని టిడ్కో గృహాలను వెంటనే మరమత్తులు చేయించి మౌలిక వసతులు ఏర్పాటు చేసి అర్హులైన బాధితులు అందరికీ వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రాయబారం వందనం, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఎ. పవన్ కుమార్, షేక్ చిన సుభాని,కె. మల్లికార్జున, షేక్ మస్తాన్, పోట్లురి వెంకటేశ్వర్లు, కరీం బాషా, సైదావలి, మహబూబ్ ఖాన్, జల్లి వెంకటేశ్వర్లు, బి లక్ష్మయ్య, బూదాలమను, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. (Story : భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం యువత ఉద్యమించాలి..)