పోలవరం ప్రభావిత నిర్వాసితులకు న్యాయమైన తక్షణ పరిష్కారం చేయాలి.. సిపిఎం
న్యూస్‌తెలుగు/ చింతూరు : పోలవరం ప్రాజెక్టు ప్రభావిత నిర్వాసిత ప్రజానీకానికి పునరావాసం పరిహారం న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదివారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మండల కార్యదర్శి పల్లపు వెంకట్ అన్నారు. పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ లిస్టులో కొంతమంది పేర్లు లేకపోవడంతో నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారని కొందరు పేర్లు తప్పుగా ఉండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, గతంలో సేకరించిన నిర్వాసితుల స్థానిక ఆధారిత పత్రాలు లిస్టులో పొందుపరచక పోవటం వలన అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురైనాయని. పోలవరం భూసేకరణ అభిప్రాయ సమావేశంలో కూడా పలువురు ఈ విషయంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు తెలియజేయడం జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో అందరికీ సమన్యాయం జరిగేలా సర్వే నిర్వహించి పునరావాసాలకు ఖచ్చితమైన పరిహారం అందించి స్ట్రక్చర్ విలువలు కూడా అవకతవకగా ఉండటంతో నిర్వాసిత ప్రజానీకం ఆందోళన చెందుతున్నారన్నారు. భూసేకరణ అభిప్రాయ విషయంలో కూడా సరైన సమాధానం అధికారుల నుండి లేకపోవడంతో ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలో అర్థం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భూ సేకరణ ప్రజాభిప్రాయాన్ని ముందుగా తీసుకొని ఆపై గ్రామ సభలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. స్థానిక సమస్యలు బీడీ ఆకు ప్రూనింగ్ పనులు ఇప్పటికే ఆలస్యం అయిపోయాయని ఆదివాసీల రెండవ పంటగా ఉంటున్న బీడీ ఆకు సేకరణ కూడా ఈ సంవత్సరం పెండింగ్లో పడే సమస్య ఉందని ఈ సమస్యను అటవీ అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. పలు గ్రామాల్లో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఇప్పటికే వేసవి తాపం అధికమై ప్రజలు ఇబ్బందులకు అవుతున్నారని తక్షణమే తాగునీటి బోర్లు అవసరమైన గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 26వ తేదీన జరప తలపెట్టిన ఆందోళనకు బాధిత ప్రజానీకం అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రం శెట్టి శ్రీనివాసరావు. సీసం సురేష్, ముర్రం రంగమ్మ, ఎడమ సుబ్బమ్మ, కలుముల మల్లేష్, మడకం చిన్నయ్య, పెద్ద రాములు, కారం సుబ్బారావు, పొడిఎంలక్ష్మణ్ , చింత రాంబాబు, కోవాసి భీమయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : పోలవరం ప్రభావిత నిర్వాసితులకు న్యాయమైన తక్షణ పరిష్కారం చేయాలి.. సిపిఎం)