చారిత్రాత్మకమైన నిలువురాళ్ళను సందర్శన
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని మదర్స్ ల్యాప్ హై స్కూల్ విద్యార్థులు మరియు ప్రిన్సిపల్ అబ్దుల్ ముబీన్ , ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ రావు , నారాయణపేట జిల్లా కేంద్రంలోని ముడుమూరు గ్రామంలో ఉన్న చారిత్రాత్మకమైన నిలువురాళ్ళను సందర్శించారు, ఈ కార్యక్రమంలో ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ మన పూర్వీకులకు కొన్నివేల సంవత్సరాల క్రితమే విజ్ఞాన శాస్త్రo పై అవగాహన కలిగి ఉన్నారని అందులో భాగంగానే ఇక్కడ నిలువు రాళ్ళను ప్రతిష్టించారని అన్నారు ఈ నిలువురాళ్ల ఆధారంగా కాలాన్ని, సమయాన్ని, మరియు ఋతువులను గుర్తించే వారని, అలాగే ఆకాశంలో నక్షత్రాలను పోలిన సప్తర్షి మండలాన్ని ఇక్కడి రాళ్లపై చెక్కారని తెలిపారు, త్వరలోనే ఈ నిలువు రాళ్లకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కుతుందని అన్నారు, పాఠశాల విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేమని మాట్లాడారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని మదర్స్ ల్యాప్ హై స్కూల్ కు చేరుకొని విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించారు, సోలార్ సిస్టం (సౌర కుటుంబం), మరియు అంతరిక్ష కేంద్రం, స్పేస్ లో ఆస్ట్రోనాట్ల జీవన విధానం, ఇటీవల సునీత విలియమ్స్ చేపట్టిన అంతరిక్ష యానం గురించి మాట్లాడారు, మరియు విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అబ్దుల్ ముబీన్ మరియు ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.(Story : చారిత్రాత్మకమైన నిలువురాళ్ళను సందర్శన)