రాణించిన కోహ్లీ: ఆర్‌సీబీ శుభారంభం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2025) సమరాంగణం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) శుభారంభం పలికింది. శనివారంనాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ఆటతీరు, కృనాల్ పాండ్యా బౌలింగ్, ఆర్‌సీబీ సమష్టి పోరు ఆ జట్టును విజయపథాన నడిపించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, ఆర్‌సీబీ ఇంకా 3.4 ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. ఈ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తొలి విజయం నమోదు చేసింది. కోల్‌కతా తొలి ఓటమిని కూడగట్టుకుంది. కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే ఈ ఐపీఎల్ తొలి అర్థసెంచరీని నమోదు చేయగా, కోహ్లీ రెండవ అర్థసెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసుకొని కేకేఆర్‌ను కుప్పకూల్చిన కృనాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఓపెనర్లు సాల్ట్, కోహ్లీలు అద్భుతమైన భాగస్వామ్యంతో దాదాపు విజయాన్ని ముందుగానే ఖరారు చేశారు. సాల్ట్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్ (10), పటీదార్ (34) రాణించగా, చివర్లో లివింగ్‌స్టన్ కేవలం 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ సాయంతో 15 పరుగులు చేసి విజయానికి కావాల్సిన పరుగులను చేసి పరిపూర్ణం చేశాడు. కేకేఆర్ బౌలర్లలో అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొక్క వికెట్టు చొప్పున తీసుకున్నారు.
అంతకుముందు, ఆర్‌సీబీ టాస్ గెలిచి ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కేకేఆర్ మంచి దూకుడుగా ఆట ప్రారంభించింది. కాకపోతే డీకాక్ ఒకేఒక్క బౌండరీ కొట్టి హజల్‌వుడ్‌కు వికెట్టును సమర్పించుకున్నాడు. ఆ తర్వాత సునీల్ నరైన్, అంజిక్య రహానేలు దుమ్ముదులిపారు. ఇద్దరూ రెండో వికెట్టుకు 103 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఇందులో రహానే కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు, నరైన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 44 పరుగులు జోడించారు. వారిద్దరి నిష్క్రమణ తర్వాత మిడిలార్డర్, టెయిలెండర్లు సమస్యల్లో కూరుకుపోయారు. వారిలో రఘువంశీ (30) తప్ప మిగతావారెవ్వరూ పెద్దగా రాణించలేదు. దీంతో 174 పరుగుల వద్దనే కేకేఆర్ వేట ముగిసిపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు, హజల్‌వుడ్ 2 వికెట్లు తీసుకోగా, యశ్, రసిఖ్, సుయాష్‌లు ఒక్కొక్క వికెట్టు చొప్పున తీసుకున్నారు. (Story: రాణించిన కోహ్లీ: ఆర్‌సీబీ శుభారంభం)
Follow the Stories:
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!