జిడిపిక్కలు కొనుగోలుపై మేలుకువులు
న్యూస్ తెలుగు/ సాలూరు : నాణ్యమైన జీడి పప్పు కొనుగోలు చెయ్యాలని వెలుగు( ITADA) APD వై.సత్యం నాయుడు తెలిపారు. శనివారం సాలూరు వెలుగు కార్యాలయంలో సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాలు VDVK కమిటీ సభ్యులు జిడిపిక్కలు కొనుగోలుపై మేలుకువులు, రికార్డులు నిర్వహణ తదితర అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి పిక్కలు సీజన్ ప్రారంభమైంది అని, VDVK సభ్యులకు అవగాహన కల్పించి, ఏ గ్రేడ జీడి పిక్కలు కొనుగోలు చేయాలన్నారు. ముందుగా జీడి రైతులకు VDVK ద్వారా కొనుగోలు చేస్తామని అవగాహన కల్పించాలని కోరారు. కమిటీ సభ్యులు బాధ్యత పడే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వెలుగు APM లు ఏ.జయమ్మ, ఈ. జయకుమార్, శివున్నయుడు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. (Story : జిడిపిక్కలు కొనుగోలుపై మేలుకువులు)