258 కేజీల గంజాయి సీజ్
న్యూస్ తెలుగు /సాలూరు : అక్రమంగా తరలిస్తున్న 258 కేజీల గంజాయిని పట్టుకొని రెండు కార్లను సీజ్ చేశామని సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. శనివారం పాచిపెంట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి పాచిపెంట మండలం గోగడ వలస గ్రామం సమీపంలో 6 లైన్స్ హైవే పక్కన ఎస్సై వెంకట సురేష్ HC కృపారావు వారి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒరిస్సా నుంచి వైజాగ్ వెళ్తున్న రెండు AP 31 BJ 4853 ఆల్టో కారు AP O4 AV 0459 నిస్సాన్ ఈ రెండు కార్లలో తరలిస్తున్న ఈ గంజాయి 132 ప్యాకెట్లలో 258 కేజీలు 25,80,000 విలువ ఉంటుందని తెలిపారు. కార్లలో ఉన్న నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు . (Story : 258 కేజీల గంజాయి సీజ్)