హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో విద్యా వికాస్ విద్యార్థిని కి 3వ ర్యాంక్
న్యూస్ తెలుగు / వినుకొండ : హైదరాబాదు లోని “అక్షర హ్యాండ్ రైటింగ్ ” అకాడమీ వారు నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే (జనవరి-25) సందర్భము గా ఉమ్మడి తెలుగురాష్ట్రాల వ్యాప్తము గా నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లలో వినుకొండ లోని విద్యావికాస్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న బత్తుల రాజశ్రీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ విభాగము లో ” స్టేట్ టాప్ – 3” లో ఒకరిగా నిలిచారు. మార్చి 15, 16వ తేదీలలో తిరుపతి లో జరిగిన హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్- 2 వ సమావేశము లో ఈ బహుమతిని రాజశ్రీ తరపున చేతిరాత నిపుణుడు ఎస్. వి. సీతారామయ్య అందుకోవడం జరిగింది. ఈ సందర్భమంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో విద్యావికాస్ హైస్కూల్ డైరక్టర్ తిరుమలశెట్టి బాలయ్య, బహుమతి సాధించిన రాజశ్రీ ని అభినందిస్తూ విద్యార్థులందరూ కూడా చక్కని, అందమైన చేతిరాతను సాధన చేయాలని, చదవటం ఎంత ముఖ్యమో, రాయటం కూడా అంతే ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. చేతిరాత నిపుణుడు ఎస్.వి. సీతారామయ్య మాట్లాడుతూ. సుమారు 25 వేల మంది పైగా పాల్గొన్న ఈ చేతిరాత పోటీల లో బత్తుల రాజశ్రీ బహుమతిని సాధించటం విశేషమని అన్నారు.
విద్యావికాస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.. సాంబశివరావు మాట్లాడుతూ. గత
10 సం॥ నుంచి మా విద్యావికాస్ హైస్కూల్
నందు చేతిరాత శిక్షణ క్లాసులు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్క విద్యార్థికి మంచి చదువును అందించటం తో పాటు అందమైన చేతిరాతను రాసేలా తర్పీదు ఇవ్వటం మా ఉద్దేశము అని తెలియజేసారు. (Story : హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో విద్యా వికాస్ విద్యార్థిని కి 3వ ర్యాంక్)