Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌ కన్వీనర్‌ కోటాలో 35 శాతం
అమరావతిలో విట్‌ ఏపీ, ఎస్‌ఆర్‌ఎం ఏపీ యూనివర్సిటీలు
మోహన్‌బాబు, సెంచూరియన్‌, ఆదిత్యలో లభ్యం
టాప్ ప్లేస్ మెంట్లు
ర్యాంకు కొట్టు..ఉచిత సీటు పట్టు..
ప్రతిభ విద్యార్థులకు మెరుగైన అవకాశం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం
రిజర్వేషన్లలోను సీట్ల కేటాయింపు

న్యూస్‌ తెలుగు/అమరావతి: మీరు..ఏపీ ఈఏపీసెట్‌ 2025కు దరఖాస్తు చేశారా? అయితే పరీక్షలకు పూర్తిగా సిద్ధం కండి.. మెరుగైన ర్యాంకు తెచ్చుకుని ఈ పోటీ ప్రపంచంలో వీలైనంత వరకు మందు వరుసలో ఉండండి. అలా అయితే మీకు ఈ ప్రైవేట్‌ యూనివర్సిటీలలో ఉచిత ఇంజినీరింగ్‌ సీటు పక్కా.
అవును.. గత ప్రభుత్వ హయాం నుంచి టాప్‌ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ యూనివర్సిటీల్లో ఏపీ ఈఏపీసెట్‌ కన్వీనర్‌ కోటా కింద 35 శాతం సీట్లను భర్తీ చేస్తున్నారు. అదే అనవాయితీని కూటమి ప్రభుత్వం వచ్చాకనూ కొనసాగిస్తోంది. గత ఏపీ ఈఏపీసెట్‌-2024లోను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నేతృత్వంలో ఈ కన్వీనర్‌ కోటా కింద టాప్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీలలో సీట్లను ఉచిత సీట్లను కేటాయించారు. ఈ విద్యా సంవత్సరం అవి అమలుకానున్నాయి.
ఒక్కో యూనివర్సిటీలో ఎంపిక చేసిన అన్ని బ్రాంచీలను కలిపి ఉన్న సీట్లలో 35 శాతం సీట్లు ఈ కన్వీనర్‌ కోటాలోకి వచ్చేస్తాయి. అలా వచ్చిన సీట్లను బ్రాంచీల వారీగా ఉన్న ఖాళీలను ఏపీ ఈఏపీసెట్‌ 2025 వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఎంపిక చేసుకోవాలి. ఏపీఈఏపీసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా వెళ్లిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద అర్హత ఉంటే..వారిని ఉచిత సీటు కింద పరిగణిస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం అమలు చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఆయా యూనివర్సిటీల యాజమాన్యం ఖాతాలో జమ జేస్తారు. దీంతోపాటు రిజర్వేషన్లనూ ఈ కోటాలో వర్తింపజేస్తారు. ఆయా ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద ఎంపికై..ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేకపోతే..వారికి కన్వీనర్‌ కోటా నిర్దేశించిన రూ.లక్షా 20వేలు లేదా ఆ పైన ఏడాదికి ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మొత్తంగా ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ఉచిత ఇంజినీరింగ్‌ సీట్లు పొంది..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం కలిగిన ఎంతో మంది విద్యార్థులు మంచి ప్లేస్ మెంట్లు పొంది తమ జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు.

ఉచిత ఇంజినీరింగ్‌ సీట్లు కల్పించే ప్రైవేట్‌ వర్సిటీలు ఇవే..

ఏపీ ఈఏపీసెట్‌ 2025 ద్వారా 35 శాతం కన్వీనర్‌ కోటా కింద ఉచిత సీట్లు కల్పిస్తున్న ప్రైవేట్‌ యూనివర్సిటీల వివరాలిలా ఉన్నాయి.
అమరావతిలోని విఐటీ-ఏపీ, ఎస్‌ఆర్‌ఎం-ఏపీ ఉన్నాయి. 2025 విద్యా సంవత్సరంలో ఏపీఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశాలకు అర్హత పొందే విద్యార్థులు ఈ యూనివర్శిటీల్లో కన్వీనర్‌ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ క్రింది 9 ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి

1. ఎస్‌ఆర్‌ఎం-ఏపీ యూనివర్శిటీ, అమరావతి. వెబ్‌సైట్‌:  https://srmap.edu.in/
2. 2. విఐటీ`ఏపీ యూనివర్శిటీ, అమరావతి. వెబ్‌సైట్‌: https://vitap.ac.in/
3. సెంచూరియన్‌ యూనివర్శిటీ, విశాఖపట్నం. వెబ్‌సైట్‌: https://cutm.ac.in/
4. కేఆర్‌ఈఏ యూనివర్శిటీ, శ్రీసిటీ, సూళ్లూరుపేట. వెబ్‌సైట్‌: https://krea.edu.in/
5. వేల్టెక్‌ యూనివర్శిటీ, చిత్తూరు. వెబ్‌సైట్‌: https://veltech.edu.in/
6. మోహన్‌బాబు(ఎంబీ) యూనివర్శిటీ, తిరుపతి. వెబ్‌సైట్‌: https://mbu.asia/
7. గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, రాజమండ్రి. వెబ్‌సైట్‌: https://godavariglobaluniversity.ac.in/
8. అన్నమాచార్య యూనివర్శిటీ, రాజంపేట. వెబ్‌సైట్‌: https://annamacharya.ac.in/
9. ఆదిత్య యూనివర్శిటీ, కాకినాడ. వెబ్‌ సైట్‌ : https://aditya.ac.in/

ఎస్‌ఆర్‌ఎం-ఏపీ యూనివర్సిటీ(అమరావతి) బి.టెక్‌, ఇంజినీరింగ్‌ బ్రాంచీలు:
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) విభాగంలో, విద్యార్థులు కింది ప్రత్యేకతలను ఎంచుకోవచ్చు:
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ (ఏఐఅండ్‌ ఎంఎల్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఎల్‌ఓటీ), డిస్ట్రిబ్యూటెడ్‌ అండ్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ (వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌), ఏఐ అండ్‌ ఫ్యూచర్‌ టెక్నాలజీస్‌, సివిల్‌, మెకానికల్‌ బ్రాంచీలలో సీట్లు కన్వీనర్‌ కోటా కింద అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఎస్‌ఆర్‌ఎం-ఏపీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌… https://srmap.edu.in/ లింక్‌పై క్లిక్‌ చేయగలరు.

విఐటీ-ఏపీ (అమరావతి) బి.టెక్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీలు:

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ)
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌)
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (బ్లాక్‌చైన్‌)
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సైబర్‌ సెక్యూరిటీ)
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (డేటా అనలిటిక్స్‌)
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌)
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ)
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (విఎల్‌ఎస్‌ఐ)
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌)
మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రోబోటిక్స్‌
ఆయా ప్రోగ్రాములు పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి.
ప్రతి శాఖలో ప్రత్యేకీకరించిన కోర్సులు, ల్యాబ్‌ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు, దయచేసి విఐటీ-ఏపీ యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌ : https://vitap.ac.in/ సందర్శించండి:
మిగిలిన ప్రైవేట్‌ యూనివర్సిటీల బ్రాంచీల వివరాల కోసం ఆయా వెబ్‌సైట్‌లను తిలకించవచ్చు. (Story: టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!)

Follow the Stories:

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ స్పీచ్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!