విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం..
న్యూస్ తెలుగు /వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో భవన ఆవరణలో 83వ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గంగినేని ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా చిన్నారి తాతయ్య గంగినేని వెంకటేశ్వర్లు జయమ్మ దంపతులు మరియు చిన్నారి తల్లిదండ్రులు జి. మునిస్వామి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం సభ్యులు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయని ఇదేవిధంగా సభ్యులు సహకారం అందించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు,జి నాగేంద్రుడు,అవ్వారు కోటేశ్వరరావు, వై వి సుబ్బయ్య శర్మ, బి.పి.ఎస్. సుందర్రావు, రాఘవయ్య, శేషయ్య, నారాయణ రావు,ఏ రామలింగేశ్వరరావు, కృష్ణమూర్తి, గోపి, ఎం.వి శర్మ, హసన్, దుబ్బల దాసు, శంకర్రావు, దీక్షితులు, ఆది రాములు, కే. వెంకటేశ్వర్లు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. (Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం..)