న్యాయం చెయ్యాలంటూ తాసిల్దార్ కు రైతుల వినతి
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ తాసిల్దార్ కు వినుకొండకు చెందిన బాధిత రైతులు వినతి పత్రం అందజేశారు. వినుకొండ గ్రామంలోని సర్వేనంబర్ 928/4a,928/4b, 928/12, 944/3, 944/4, ధాఖలా సుమారు 20 ఎకరాల మెరక భూములను మా పూర్వీకులు సంపాదించిన మెరక సదరు భూములను వారి అనంతరం వంశపారంపర్యంగా మేము మెట్టపైర్లు సాగు చేసుకుంటూ శతాబ్ధాలుగా జీవనం కొనసాగిస్తున్నాము. సదరు భూములు వినుకొండ గ్రామ పరిధిలోని నవాసుకుంట దాటినాకా తిమ్మాయిపాలెం రోడ్డుకు దక్షిణం వైపున గల బండ్ల బాట ద్వారా మేము మా భూములలోనికి మా తరతరాలుగా కొన్ని శతాబ్దాల కాలంలనుండి రాకపోకలు కొనసాగిస్తూ మా భూములలో వ్యవసాయం చేసుకొను చున్నాము. ప్రస్తుతం మాకు చెందిన సదరు భూములకు తూర్పున ఉన్న బండ్లబాటను సదరు బాటకు తూర్పున ఉన్న కొందరు సుమారు 52ఎకరాల విస్తీర్నాన్పి కొనుగోలు చేసి ప్లాట్లు, రోడ్లు ఏర్పాటు చేసి వ్యాపారం చేయుచున్నారు. సదరు భూములకు మా భూములకు మద్యలో ఉండబడిన బండ్ల బాటను వారు దురాక్రమణ చేసి మాకు చెందిన భూములలోకి వెల్లకుండా రోడ్డుకు అడ్డంగా ప్రహరిగోడను నిర్మించేందుకు ఇనుప ఫిల్లర్లను వేసిఉన్నారు. వారి చర్యల వల్ల మేము మా భూములలోకి స్వేచ్ఛగా వెల్లి రాకపోకలు జరిపేందుకు అవకాశం లేదు. కావున మాయందు దయ ఉంచి వారి దురాక్రమణలకు తమరు అడ్డుకట్టవేసి మేమూ సదరు బాటలో మునపటిలా స్వేచ్ఛ గా ట్రాక్టర్లు, బండ్లు, రైతులము వైగరా స్వేచ్చగా రాకపోకలు కొనసాగించేలాచేర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ భవన్ నారాయణ, దేవరకొండ వెంకటమ్మ , కంచర్ల కొండమ్మ, మాసరపు అంజమ్మ , ఎడమడుగు శంకర్, ముత్యాలపాటీ వెంకట లక్ష్మీ నందిని, చిట్టెం శెట్టి సత్యం పాల్గొన్నారు. (Story : న్యాయం చెయ్యాలంటూ తాసిల్దార్ కు రైతుల వినతి)