సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ 70 చెక్కులను 20 లక్షల 86 వేల రూపాయలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. సకాలంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందజేసినందుకు లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వానికి ,చిన్నారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్. వనపర్తి మండల్ , రాష్ట్ర మైనార్టీ నాయకులు కమ్మర్ మియా,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ ,పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, వనపర్తి జిల్లా మీడియా కమ్యూనికేషన్ అధ్యక్షుడు పురుషోత్తం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబా, రాగి వేణు, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్ రెడ్డి, నాగార్జున,జానంపేట నాగరాజు, అబ్దుల్లా,గోవింద్, రాఘవేంద్ర రెడ్డి, గోవర్ధన్ ,విక్రమ్ రెడ్డి, భాజ శీను, తదితరులు పాల్గొన్నారు. (Story : సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన జిల్లెల చిన్నారెడ్డి)