హెల్త్ సెంటర్ కు బీరువ బహుకరణ
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఎన్. ఎస్. పి. కాలనీ లో ఉన్న ఆర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి మానవ సేవ సమితి సభ్యులైన ఎస్. ఎస్. వి ఎంటర్ప్రైజెస్ ఓనర్ మస్తాన్, బీరువా అందించారు. ఈ కార్యక్రమంలో మానవ సేవ సమితి అధ్యక్షులు పి.వి. సురేష్ బాబు, డాక్టర్ పర్వీన్, డాక్టర్ సోము నాయక్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీ.వీ.సురేష్ బాబు మాట్లాడుతూ. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ స్ఫూర్తితో సహోదయులు సహకారంతో ఆసుపత్రికి అవసరమైన వస్తువులను ఇప్పించడం జరుగుతున్నది. అందులో భాగంగా గురువారం బీరువా బహుకరించిన మస్తాన్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తూన డాక్టర్ర్స్ కి ఆస్పత్రి సిబ్బంది కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. (Story : హెల్త్ సెంటర్ కు బీరువ బహుకరణ)