ప్రపంచ స్థాయికి అరకు కాఫీ
న్యూస్ తెలుగు /సాలూరు : అరుకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శాసనసభ ఉప సభాపతి రఘురాం కృష్ణంరాజు ఇతర శాసనసభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ సంతోషకరం. మన రాష్టానికి సంబంధించిన అరకు కాఫీకి ప్రాచుర్యం కల్పించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు..మన గిరిజన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఆయనకు శతకోటి ధన్యవాదాలని తెలిపారు. (Story : ప్రపంచ స్థాయికి అరకు కాఫీ)