ఆశ్రమ పాఠశాల శానిటేషన్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
న్యూస్ తెలుగు/చింతూరు : ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ పాఠశాల శానిటేషన్ ఆయా వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పోడియం లక్ష్మణ్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల కళాశాలలో పనిచేస్తున్నటువంటి శానిటైజర్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. మూడు నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలి. పని భారాన్ని తగ్గించాలి. పనిచేస్తున్న క్రమంలో శానిటేషన్ వర్కర్లకి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ శానిటేషన్ వర్కర్ కు తీసుకోవడం జరిగింది అలానే ఈ కూటమి ప్రభుత్వం కూడా శానిటేషన్ వర్కర్లకి కనీస వేతనం ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శానిటేషన్ వర్కర్ల అందరితో మహా ధర్నా కార్యక్రమం చేపడతామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినీతి పత్రానికి ఏవో కీ అందజేశారు. ఏవో మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్ల సమస్యలు నాపై అధికారులకి తెలియజేసి వారితో పాటు కూటమి ప్రభుత్వానికి తెలియపరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటైజర్ వర్కర్లు సుజాత. విజయ. సురేఖ. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (Story : ఆశ్రమ పాఠశాల శానిటేషన్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి)