బిజాపూర్ జిల్లా యస్ పి ఎదుట లొంగి పోయిన 19 మంది మావోయిస్టులు
లొంగి పోయిన వారిలో రు.29 లక్షల రివార్డ్ ఒక మావోయిస్టు
న్యూస్ తెలుగు/చింతూరు : బిజాపూర్ జిల్లా యస్ పి జితేంద్ర యాదవ్ ఎదుట సోమవారం 19 మంది మావోయిస్టులు లొంగపోయారు.తలా ఒక.8 లక్షల రివార్డుతో ఉన్న ఏసీ ఎం పద్ధం దేవా,అతని భార్య కలుము దులి లొంగి పోయారు. వీరితోపాటు మరో ఏసియం కట్టం సురేష్, రెండు లక్షల రివార్డు కలిగిన పూనెం. సోని, లక్ష రూపాయలు రివార్డు కలిగిన కట్టం నారాయణ, మడివి అందా, బామి కుహ్రమి వున్నారు. వారే కాక మడివి శంకర్, తాటి లక్మ, మాడవి. పాండు, సోడి జోగా, కట్టాం పీడుగ, సోడి. ఎర్ర, కాక చిన్నబ్బి లొంగిపోయారు. ఈ సందర్బంగా యస్ పి డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ పునరావాసం విధానం కింద లభించే ప్రయోజనాలు చాలామంది మావోయిస్టులను ఆకర్షించి లొంగిపోతున్నారన్నారు. మావోయిస్టులో కలిసిపోయిన వారి కుటుంబాలకు ఘర్ వాపసి తిరిగి జన స్రవంతి లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని ప్రయోజనాలను అంద చేస్తామని తిరిగి ప్రజల్లో భయం లేకుండా తిరగవచ్చు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. (Story : బిజాపూర్ జిల్లా యస్ పి ఎదుట లొంగి పోయిన 19 మంది మావోయిస్టులు )