Home వార్తలు ఘనంగా జరుపుకున్న “అనగనగా ఆస్ట్రేలియాలో”

ఘనంగా జరుపుకున్న “అనగనగా ఆస్ట్రేలియాలో”

0

ఘనంగా జరుపుకున్న “అనగనగా ఆస్ట్రేలియాలో”

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రయిలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో వినుత్నంగా జరిగిన ఈ కార్య్రమంలో రచయిత, దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
దర్శకుడు తారక రామ మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశామన్నారు. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రం తెలుగు వారే అని వెల్లడించారు. తెలుగు వాడు అయిన తాను ఆస్ట్రేలియాలో ఐటీ జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయినట్లు చెప్పారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఇష్టంతో జాబ్ చేసుకుంటూనే ఫిల్మ్ కోర్స్ లో మాస్టర్స్ చేసినట్లు చెప్పారు. సినిమాపై ఉన్న ఇష్టమే తనను ఈ సినిమా తీసేలా చేసిందని చెప్పారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వాతావరణం చాలా వింతగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో సినిమా చేయడం చాలా కష్టమైనప్పటికీ ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
మొత్తం షూటింగ్ 122 రోజుల్లో 83 లోకేషన్స్ లో పూర్తి చేసినట్లు చెప్పారు. చాలా మంది స్క్రిప్ట్ చదవి ఈ చిత్రం ఇక్కడ చేయడం కష్టమన్నారు. అయినా పట్టువిడువకుండా పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం మార్చి 21 ప్రేక్షకుల ముందుకు వస్తుంది అందరూ ఆశీర్వదించాలని దర్శకుడు తారక రామ పేర్కొన్నారు.
అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. చాలా రోజుల తరువాత మంచి థ్రిల్లర్ ను చూడబోతున్నట్లు ట్రయిలర్ చూస్తే అర్థం అవుతుంది. హాలీవుడ్ గడ్డపై తీయడమే కాదు హాలీవుడ్ మేకింగ్ కనిపిస్తుంది. యదార్థసంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మనదగ్గర ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు ఒక ఆలోచన ఉంటుంది కానీ విదేశాల్లో జరిగే సంఘటనలు ఎలా ఉండబోతాయో తెలియాలంటే మార్చి 21 వరకు వేచి చూడాల్సిందే.
చిత్రం : అనగనగా ఆస్ట్రేలియాలో
బ్యానర్ : సహాన ఆర్ట్స్ క్రియేటషన్స్
రచన, దర్శకుడు : తారక రామ
నిర్మాత: బి టి ఆర్ శ్రీనివాసరావు
ఎక్స్ గ్యూటీవ్ ప్రొడ్యూసర్ : మాధవి మంగపాటి
సంగీతం: యూ వి నిరంజన్
డిఓపి : అరుణ్ దొండపాటి
ఎడిటింగ్ : తారక రామ
పీఆర్ఓ: దినేష్, హరీష్ (Story : ఘనంగా జరుపుకున్న “అనగనగా ఆస్ట్రేలియాలో”)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version