చింతూరు ఏజెన్సీలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం
అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఆధ్వర్యంలో మూత్రపిండాల ఆరోగ్యం మరియు ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చింతూరు మండలం కుమ్మూరు గ్రామం లో నిర్వహించారు.
మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే పరీక్షించుకోండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే థిమ్ తో హెల్త్ క్యాంపులు, ఆరోగ్య చర్చలు కార్యక్రమాలను నిర్వహించారు.
సమస్యలను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అని
“క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సి కె డి ) బాధితుల సంఖ్య పెరుగుతోందని ముందుగా పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా దీన్ని నిరోధించవచ్చని ప్రజలకు మూత్రపిండల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం మా బాధ్యతగా భావిస్తున్నాం అందుకే, ఉచిత పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి మద్దతుగా నిలుస్తున్నాం.” అని “మూత్రపిండ వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి ముందస్తు పరీక్షలు చాలా అవసరం. కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా, వేలాది మందికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్‌లు అందించగలిగామని గర్వంగా భావిస్తున్నాం.” అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా నాణ్యమైన డయాలసిస్ సేవలను అందించడంతో పాటు, మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందని
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి… వెంటనే పరీక్ష చేయించుకోండి! అని పిలుపునిచ్చారు
అపోలో డయాలసిస్ క్లినిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సుధాకరరావు ,రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, కార్యకలాపాలు, వ్యాపార అభివృద్ధి మేనేజర్ శ్రీ మధు కిరణ్ వంటిపల్లి, డయాలసిస్ క్లినిక్ మేనేజర్ అభిరామ్ , డిప్యూటీ డి అండ్ యం హెచ్ ఓ . పి.పుల్లయ్య ,మెడికల్ సూపరింటెండెంట్ డా కోటిరెడ్డి
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచు ముచ్చిక నాగార్జున , ఆశా వర్కర్లు వందకు పైగా గ్రామస్తులు పాల్గొన్నారు. (Story : చింతూరు ఏజెన్సీలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం)